అమెరికాకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
భారత్లోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100కు పైగా కళా ఖండాలను అమెరికా తిరిగి వెనక్కు ఇచ్చిందంటూ ఆ దేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రూ.12 వేల కోట్ల విలువైన 10 లక్షల కేజీల మత్తు పదార్థాలను భారత్ నాశనం చేసి రికార్డు సృష్టించిందని వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్లో ఒక్క రోజులో 300 కోట్ల మొక్కలు నాటి రికార్డు నెలకొల్పారని ప్రజా భాగస్వామ్యం తోనే ఇది సాధ్యమైందని అన్నారు. భారత్లోని యాత్ర స్థలాలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని, కాలిఫోర్నియా నుంచి అమర్నాథ్ యాత్రకు ఇద్దరు విదేశీ యాత్రికులు వచ్చారని ప్రధాని మోదీ తెలిపారు.













