భారత్ విషయంలో.. పాకిస్థాన్ కీలక నిర్ణయం
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. రెండు దేశాల మద్య శాంతి నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న సందర్భంలో పాకిస్థాన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. జూన్ 20 వరకు ఇండియా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు పాక్ మీడియా చెప్పింది. చక్కెర దిగుమతిపై కూడా త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. గత 30 ఏళ్లలో ఎప్పడూ లేని విధంగా పాకిస్థాన్ పత్తి దిగుబడి భారీగా తగ్గిపోవడంతో భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అయితే దీనిపై ఇండియా అధికారికంగా స్పందించలేదు.













