స్పెయిన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ
స్పెయిన్ విదేశాంగ మంత్రి జోసే మాన్యూల్ అల్బారెస్ బ్యూనోతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూఢల్లీిలో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరు దేశాల మంత్రులు విస్తృతంగా చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం గురించి చర్చలు జరిపినట్టు సమాచారం. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి, వాణిజ్యం, రక్షణ, సైన్స్, సాంకేతిక, వాతావరణ మార్పులతో సహా అనేక రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ చర్చలు ఒక అవకాశంగా ఉంటాయని కేంద్రం తెలిపింది.













