ల్యాప్‍టాప్ కు అంత్యక్రియలు…

ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల్లో ల్యాప్‍టాప్ ఒకటి. దీనిని వ్యక్తిగతంగా, వృతిపరంగా ఉపయోగిస్తుంటాం. ల్యాప్‍టాప్ ఎక్కువ లైఫ్ ఇస్తుంటుంది. అందుకే దీనితో వినియోగదారులకు అటాచ్‍మెంట్ ఎక్కువగా ఉంటుంది. తన ల్యాప్‍టాప్ పాడైపోగా సదరు వ్యక్తి చాలా బాధపడ్డాడు. దానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించాడు. టిక్ టాకర్ జెన్, అకా కింగ్‍జాన్ వాడుతున్న ల్యాప్‍టాప్ పాడైపోయింది. అతడు దాన్ని బయటపడేసేందుకు ఇష్టపడలేదు. దాన్ని తీసుకొని శ్మశాన వాటిక (ప్యునరల్ హోం)కు తీసుకెళ్లాడు. అంత్యక్రియలకు ఏర్పాటు చేయగలరా? అని రిసెప్షన్‍లో ఉన్న మహిళను అడిగాడు. ఆమె డెబ్ బాడీ ఎక్కడ అని అటూ ఇటూ చూసింది. అయితే తన ల్యాప్‍టాప్ చనిపోయిందని ఆ వ్యక్తి చెప్పగానే మహిళ షాక్ అయింది. ఈ వీడియో ఆన్‍లైన్‍లో చక్కర్లు కొడుతోంది. పరికరాలతో మనుషులకున్న ప్రేమను చూపించేందుకే ఈ వీడియో చేసినట్లు సదరు వ్యక్తి వెల్లడించారు. అయితే అతడు ఏ దేశస్తుడో వివరాలు తెలియరాలేదు.