అమెరికా ఉపాధ్యక్షురాలుకు తృటిలో.. తప్పిన ప్రమాదం

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తృటిలో ప్రమాదం నుంచి బయపపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి మేరీ ల్యాండ్‍లో ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయినందనీ, ఉపాధ్యక్షురాలు మరో విమానంలో గ్వాటెమాలా వెళ్లిపోయారని ప్రతినిధి సిమోన్ సాండర్స్ వెల్లడించారు. ఇది సాంకేతిక సమస్య మాత్రమే. భద్రతా సమస్యలు ఏవీ లేవని సాండర్స్ చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటూ తాము క్షేమంగా ఉన్నామని కమలా హ్యారిస్ కూడా ప్రకటించారు.
ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విదేశీ యాత్రకు బయలుదేరారు. మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాల, మెక్సికో పర్యటన నిమిత్తం ఎయిర్‍ఫోర్స్ 2లో బయలుదేరారు. అయితే టెకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎయిర్ ఫోర్స్ టూగా పిలిచే ఈ విమానంలో ఏదో శబ్దం వచ్చినట్లు అందులో ప్రయాణిస్తున్న ఓ జర్నలిస్టు చెప్పాడు. దీన్ని గుర్తించిన ఫైలెట్లు.. వెంటనే విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు.