ఐఎస్ఎస్ లోని ఆస్ట్రోనాట్ తో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షురాలు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న నాసా ఆస్ట్రోనాట్ విక్టర్ గ్లోవర్‌తో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నాసా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. వాణిజ్య స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా నిలిచిన గ్లోవర్‌ను ఈ సందర్భంగా కమలా అభినందించారు. ఆ తర్వాత పలు అంశాలపై వాళ్లు మాట్లాడుకున్నారు. తన తొలి స్పేస్ వాక్ అనుభవాన్ని కూడా గ్లోవర్ పంచుకున్నారు. మనం గొప్పగా ఆలోచించినప్పుడు, గొప్ప కలలు కన్నప్పుడు ఏం జరుగుతుందో మీరు చేసి చూపిస్తున్నారు. మీరు మాలో స్ఫూర్తి నింపుతున్నారు అని గ్లోవర్పై కమలా ప్రశంసలు కురిపించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.













