అమెరికా అధ్యక్షుడికి వింత అనుభవం..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వింత అనుభవం ఎదురయ్యింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఇలా మూడుసార్లు పడిపోయారు. అయితే రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కేశారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఆసియా వాసులపై వరుసగా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఆసియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులను కలవడానికి బైడెన్ వాషింగ్టన్ నుంచి అట్లాంటా పయనమయ్యారు. ఈ క్రమంలో 78 ఏండ్ల బైడెన్ ఎయిర్‌పోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ పట్టుతప్పి పడిపోయారు. తన కుడిచేత్తో రెయిలింగ్ పట్టుకుని లేచి రెండు మెట్లు ఎక్కగానే మళ్లీ జారిపోయారు. తనంత తానుగా లేస్తుండా ఎడమకాలు జారడంతో మరోమారు పడిపోయారు. అనంతరం లేచి ఎడమ కాలును దులుపుకుని మొత్తానికి పైకి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ విమానం లోపలికి వెళ్లిపోయారు. కాగా ప్రస్తుతం అధ్యక్షుడు బాగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు.













