ప్రియుడికి షాక్ ఇచ్చిన జెన్నిఫర్ లోపెజ్
అమెరికన్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ (51) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన పాటతో కోట్లాది ప్రేక్షకులని అలరించిన జెన్నిఫర్ ప్రముఖ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగెజ్తో నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తుంది. గత ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించారు. కాని కరోనా వలన వాయిదా పడింది. అయితే గతవారం వీరిద్దరూ తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు యూఎస్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. చార్మ్ స్టార్ మాడిసన్ లెక్రోయ్తో అలెక్స్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే కారణంగా జెన్నిఫర్ ఈ నిర్ణయం తీసుకుందట. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. గత ఏడాది మయామిలో 40 మిలియన్ డాలర్ల ఇంటిని కొనుకున్న ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం జెన్నీఫర్.. డొమినికన్ రిపబ్లిక్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు.













