డాక్టర్ సాంబారెడ్డికి అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్‌కి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సాంబారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ ప్రకటించిన టాప్ సైంటిస్టుల జాబితలో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లోని ఏ ఏండ్ ఎం యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ మెడిసన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రొలిఫిక్ మెడికల్ ఇన్వెంటర్, ఫార్మా రీసెర్చర్‌గా గుర్తింపు పొందారు. వరంగల్ జిల్లాలోని పరకాల మండలం చర్లపల్లిలో డాక్టర్ దూదిపాల సాంబారెడ్డి జన్మించారు. ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో ఫార్మాసీ విద్యను పూర్తి చేసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఫార్మా రంగంలో అనేక ఆవిష్కరణలను ఆయన చేశారు. న్యూరోథెరాప్యూటిక్స్‌లో ఆయన గ్లోబల్ లీడర్‌గా ఉన్నారు. ఇప్పటివరకు 215 సైంటిఫిక్ పేపర్లను ప్రచురించగా 100 మందికి పైగా స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించారు. 400 వరకు ప్రెజెంటేషన్లకు ఆయన సహకారం అందించారు.













