అదృష్టం అంటే ఆయనదే.. రాత్రికి రాత్రే
అదృష్టం అంటే ఆయనదే. లక్కీ డ్రా చివరి దశలో ఉండగా చేరాడు. మరో ఐదు గంటల్లో డ్రా ముగుస్తుందనగా వాటర్ బాటిల్ కొన్నాడు. డ్రా తీయగా ఆయనే విజేతగా అయ్యాడు. ఏకంగా రూ.2 కోట్లు గెలుచుకున్నాడు. ఈ మేరకు దుబాయ్ మహజూజ్ డ్రాలో భారతీయుడు, హైదరాబాద్ వాస్తవ్యుడికి రాత్రికి రాత్రే దశ తిరిగింది. మిర్ అనే 37 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం యూఏఈ వెళ్లారు. అక్కడే ఓ సంస్థలో ఉద్యోగం రావడంతో చేరిపోయారు. రెండు వారాల క్రితం ఆయన భార్య మహజూజ్ డ్రాలో వెయ్యి దిర్హామ్‌లు (రూ.20 వేలు) గెలుచుకోగా, ఈసారి మిర్ 10 లక్షల దిర్హామ్‌లు రూ.2 కోట్లు గెలుపొందారు.













