ఐక్యరాజ్యసమితి సదస్సుకు హైదరాబాద్ విద్యార్థి
ఈ నెల 3 నుంచి 12 వరకు ఈజిప్టు దేశంలో జరిగే ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ చేంజ్ (యూఎన్ఎఫ్సీసీసీ) సదస్సుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థి అంకిత్ సుహాస్‌రావు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు వాతావరణ మార్పులపై అధ్యయనం చేయడంతో పాటు పరిష్కారమార్గాలను అన్వేషించి వాటి వివరాలను సదస్సుaలో ఆవిష్కరించనున్నారు. భారతదేశం నుంచి సుహాస్రావుకు అవకాశం లభించింది. సదస్సులో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ 27)లో భాగంగా 27వ సెషన్లో వాతావరణ మార్పులు, పరిష్కార మార్గాలపై సుహాస్‌రావు మాట్లాడనున్నారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు సుహాస్‌రావు ఎంపిక కావడం పట్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమన్యాం, కల్నల్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు.













