ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తుంటారు. తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. త్వరలో తాను ఫోన్ నంబర్ వాడటం ఆపేస్తానని తెలిపారు. కొన్ని నెలల్లో నేను నా ఫోన్ నంబర్ వాడటం నిలిపేస్తాను. సందేశాలు పంపేందుకు, ఆడియో, వీడియో కాల్స్‌కు ఎక్స్‌ను మాత్రమే ఉపయోగిస్తాను అని పోస్టు పెట్టారు. ఎక్స్‌లో ఆడియో/ వీడియా కాల్స్ ఫీచర్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే మస్క్ నుంచి ఈ ప్రకటన వచ్చినట్లు కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఎక్స్ ప్లాట్‌పామ్‌ను ఎవ్రీథింగ్ యాప్ గా మార్చటంలో భాగంగానే దానిని తీసుకువస్తున్నట్లు మస్క్ అందకుముందే ప్రకటించారు. దాని సాయంతోనే ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్స్ మాట్లాడవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలు ఈ కాలింగ్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తాయి.













