టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎలన్ మస్క్
ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఎలాన్ మాస్క్‌ను ది టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాకిగాను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అయినా సొంత ఇల్లు లేదు. ఈ మధ్యే తన కంపెనీని అమ్మడం మొదలు పెట్టాడు అంటూ ఎలాన్ మస్క్ గురించి టైమ్ మ్యాగజైన్ వ్యాఖ్యానించింది. అతడు ఓ వైపు అంతరిక్ష కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెడ్తాడు. మరోవైపు సూర్య కాంతిని సద్వినియోగం చేసుకుంటాడు. డ్రైవర్ అవసరం లేని కారును సృష్టించాడు. ఆయన ఒక్క వేలిని కదిలిస్తే స్టాక్ మార్కెట్ పరుగెడుతుంది లేదా మూర్చపోతుంది. అతని నోటి నుంచి వచ్చే ప్రతీ మాట ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. భూమిపై ఉన్నా అంగారకుడి గురించి కలలు కంటాడు. ఎలాంటి విషయాలైనా బహిరంగంగా చెప్పేందుకు ఎలాన్ మాస్క్ వెనుకాడడు. అంటూ మాస్క్ వ్యక్తిత్వాన్ని టైమ్స్ మ్యాగజైన్ అభివర్ణియించింది.













