టెస్లా అధినేత భారీ విరాళం
ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లీ పిలుపు మేరకు టెస్లా అధినేత తన పెద్ద మనసు చాటుకున్నారు. ఎలన్ మస్క్ 5.7 బిలియన్ డాలర్లు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల ఆకలి బాధలను తీర్చేందుకు వినియోగించనున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్లో దాఖలు చేసిన వివరాల ప్రకారం నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన ఎలక్ట్రిక్ కార్లు తయారీ సంస్థల నుంచి 5 మిలియన్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరులు ఉదారత చూపితే ప్రపంచ దేశాల్లోని కోట్లాది మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయవచ్చని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే అన్నారు.













