Fuel Crisis India: ఇంధన కొరతకు కేంద్రం చెక్ .. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు!
Diesel: దేశంలో నెలకొన్న ఇంధన కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.10 చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై అదనపు సుంకాలను విధించింది. ఈ మార్పులను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIT) ఛైర్మన్ వివేక్ చతుర్వేది అధికారికంగా ప్రకటించారు.
చమురు కంపెనీలకు భారీ ఊరట:
అంతర్జాతీయంగా యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటం, ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయని వివేక్ చతుర్వేది పేర్కొన్నారు. ఈ నష్టాల నుంచి కంపెనీలకు ఉపశమనం కలిగించడానికే ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించినట్లు ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరకపోయినప్పటికీ, చమురు కంపెనీలకు ఇది పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాబోయే 15 రోజుల్లో ప్రభుత్వం సుమారు రూ.7,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది.
ఎగుమతులపై నియంత్రణ.. దేశీయంగా లభ్యత:
దేశీయ అవసరాల దృష్ట్యా ఇంధన ఎగుమతులను అరికట్టడానికి డీజిల్, ఏటీఎఫ్లపై కొత్త సుంకాలను అమలులోకి తెచ్చారు. ఈ ఎగుమతి సుంకాల ద్వారా రాబోయే పక్షం రోజుల్లో ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరనుంది. దేశంలో వాణిజ్య గ్యాస్ సరఫరాను పెంచుతూనే, ఇంధనం అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్రం ఈ వ్యూహాత్మక అడుగులు వేసింది.
ఇవి కూడా చదవండి







