మేం అణ్వాయుధాలు కోరుకోవడం లేదు : ఇరాన్
అణ్వాయుధాల విషయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాము అణ్వాయుధాలు కోరుకోవడం లేదని ప్రపంచానికి క్లారిటీ ఇచ్చారు. ఈవిషయంలో హామీ ఇచ్చేందుకు తాము సిద్ధమన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అమెరికా , ఇజ్రాయెల్ ఆరోపణల నడుమ ఇరాన్ అధినేత ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
“ఈ ప్రాంతంలో సంపూర్ణ శాంతిని తాము కోరుకుంటున్నామన్న మసూద్..అశాంతిని కోరుకుంటున్నది జియోనిస్ట్ ప్రభుత్వం (ఇజ్రాయెల్) మాత్రమే అని ఆరోపించారు. యుద్ధాన్ని, అశాంతిని సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది” అని పెజెష్కియాన్ విమర్శించారు. ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ప్రణాళికను ఇజ్రాయెల్ అనుసరిస్తోందన్నారు. దేశ గౌరవం విషయంలో … చర్చల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని ఆయన తేల్చిచెప్పారు. ఇరాన్లో ఏ నిర్ణయమైనా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ఎన్ఎస్ సీ) పరిధిలోనే, సుప్రీం లీడర్ అనుమతితోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు.. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని అమెరికా విదేశాంగమంత్రి రుబియో తెలిపారు. హర్మూజ్ జలసంధికి సంబంధించి ‘శుభవార్త’ వెలువడే అవకాశముందన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని రూబియో మరోసారి పునరుద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి







