కిలోమీటర్ల నడక.. పస్తులతో చదువులు.. విదేశీ విద్య వాస్తవాలు..!
మీ పిల్లలు బాగా చదువుతున్నారా..! వారిని అమెరికాలో చదువులకు పంపించాలని ప్లాన్ చేస్తున్నారా..? లేదా ఇతర ఏ విదేశాల్లో అయినా చదివించాలని డిసైడయ్యారా..? అయితే.. ఒక్క క్షణం.. వెయిట్ చేయండి.. ఎందుకంటే.. పడిపోతున్న రూపాయి విలువను లెక్కలోకి తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి రావాలి.. ఇది నిపుణుల మాట.
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింతగా పతనమవుతోంది. పతనం విలువ త్వరలోనే వంద రూపాయలకు చేరే అవకాశముందని సమాచారం. ఇది … భారతీయుల ఆర్థిక లెక్కలను మార్చేస్తోందని.. ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ఫారిన్ చదువులకు వెళ్లిన విద్యార్థులు సైతం చెబుతున్నారు. తమ పరిస్థితి మరింత దారుణంగా తయారైందంటున్నారు.
లండన్‌లో 8 పౌండ్ల (సుమారు రూ. 1000) శాండ్విచ్ను కేవలం 2.5 పౌండ్లకే కొనాలంటే, అది చెత్తబుట్టలోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు మాత్రమే సాధ్యం. ‘టూ గుడ్ టు గో’ అనే యాప్‌లో ఆఖరి నిమిషంలో దొరికే ఈ ఆహారం కోసం విద్యార్థులుగా తాము స్టోర్లకు పరుగు పెట్టాలని, ఒక్క క్షణం ఆలస్యమైనా మరొకరు దాన్ని సొంతం చేసుకుంటారని అక్కడి విద్యార్థులు చెబుతున్నారు.ఇలా నెలల తరబడి తాము కడుపు నింపుకుంటున్నామని మరికొందరు విద్యార్థులు తెలిపారు. రూపాయి పతనం విదేశీ విద్యార్థుల జీవితాలను ఎంత కఠినంగా మార్చిందో మాన్వి మాటలు అద్దం పడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
కలల లోకం కాదు.. కఠిన వాస్తవం..
విదేశీ విద్య అనగానే అందరూ ఊహించుకునే రంగుల ప్రపంచానికి, వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. రూపాయి విలువ పడిపోతుండటంతో భారతీయ విద్యార్థులు కనీస అవసరాల కోసం తీవ్రంగా బడ్జెట్ వేసుకోవాల్సి వస్తోంది. పార్ట్‌టైమ్ ఉద్యోగాలతో పాటు డిపార్ట్మెంటల్ స్టోర్లు, రైల్వే స్టేషన్లలో ఫ్లోర్ క్లీనింగ్ వంటి పనులు చేయడం, రోజుకు ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకోవడం, కొన్నిసార్లు పస్తులుండటం వంటివి సాధారణమయ్యాయి. డిస్కౌంట్లు, రేషన్ సరుకులు, కిరాణా బిల్లులను జాగ్రత్తగా పంచుకోవడం వారి దైనందిన జీవితంలో భాగమైంది. ప్రజా రవాణా, ఖరీదైన క్యాబ్ రైడ్లకు బదులుగా కిలోమీటర్ల కొద్దీ నడవడం పరిపాటిగా మారింది.
“విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ సంపన్న కుటుంబం నుంచి రారు. స్కాలర్‌షిప్‌లపై వచ్చేవారు, తల్లిదండ్రులు ఇళ్లు తాకట్టు పెట్టి చదివించే మధ్యతరగతి కుటుంబాల వారే ఎక్కువ” అని నిపుణులు వివరిస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు వేసుకునే బడ్జెట్ లో రూపాయి విలువ మార్పును పరిగణనలోకి తీసుకోకపోవడం పెద్ద తప్పని అంటున్నారు.
ఆర్థిక భారం.. అకడమిక్ వైఫల్యం
రూపాయి పతనం విద్యార్థులపై రెండు రకాలుగా ప్రభావం చూపుతోంది. మొదటిది, ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు రూపాయిలలో పెరిగిపోవడం. రెండోది, భారత్‌లో తీసుకున్న విద్యా రుణాలు సరిపోకపోవడం. చాలా విదేశీ యూనివర్సిటీలు సెమిస్టర్ల వారీగా ఫీజులు వసూలు చేస్తాయి. రూపాయి విలువ పడిపోవడంతో, తర్వాతి సెమిస్టర్లకు కట్టాల్సిన ఫీజుకు పాత లోన్ సరిపోవడం లేదు. దీంతో కుటుంబాలు అదనపు భారాన్ని మోయలేక ‘టాప్-అప్ లోన్లు’ తీసుకోవాల్సి వస్తోంది.
చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీలు నిర్వహించే ఆహార పంపిణీ కార్యక్రమాలపై ఆధారపడుతున్నారని, వారానికి ఒకసారి ఇచ్చే కూరగాయలు, పాలతోనే ఫ్రిజ్‌లు నింపుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు…ఈ ఆర్థిక ఒత్తిడి విద్యార్థుల చదువుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ అనీషా గుప్తా అన్నారు. “పూట గడవడమే కష్టంగా ఉన్నప్పుడు, చదువుపై ఎలా దృష్టి పెట్టగలరు? నిరంతరం ఖర్చుల గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురైతే, అకడమిక్‌గా రాణించడం అసాధ్యం” అని ఆమె స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







