కాలిఫోర్నియా రాష్ట్రం సైతం… భారత్‍కు

అమెరికాలో అత్యంత ఎక్కువగా ప్రవాస భారతీయులు నివసించే రాష్ట్రమైన కాలిఫోర్నియా సైతం భారత్‍కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. నిమిషానికి 120 లీటర్ల ఆక్సిజన్‍ను సరఫరా చేయగల డిప్లోయబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సిస్టమ్ (డీఓసీఎస్), పల్స్ ఆక్సీమీటర్లు, 275 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 240 ఆక్సిజన్ రెగ్యులేటర్లు, 400 ఆక్సిజన్ సిలిండర్లును భారత్‍కు పంపిస్తామని కాలిఫోర్నియా గవర్నర్ గవీణ్ న్యూసమ్ తెలిపారు.