రిషి సునాక్ కు గట్టి ఎదురుదెబ్బ
ఇజ్రాయెల్`హమాస్ పోరును పురస్కరించుకొని బ్రిటన్ ప్రధానమంత్రి రిషీ సునాక్ పశ్చిమాసియాలో పర్యటిస్తున్న వేళ స్వదేశంలో ఆయన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలక కన్జర్వేటివ్ పార్టీ చేతిలో చిత్తయింది. నిజానికి ఉప ఎన్నిక జరిగిన రెండు స్థానాలూ పాలక పార్టీకి కంచుకోటలు. వాటిలో మిడ్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నియోజకవర్గం మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ విదేయురాలు, మాజీ మంత్రి నాడైన్ డోరిస్ 24,664 ఓట్ల మెజార్టీతో గెలిచిన సీటు. ఈ నియోజకవర్గంలో లేబర్ పార్టీ గెలవడం ఇదే మొదటిసారి. టామ్‌వర్త్ నియోజకవర్గంలో కన్జర్వేటివ్‌ల నుంచి 23.9 శాతం మంది ఓటర్లు లేబర్ పార్టీవైపు మొగ్గారు. 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు ఓటరు నాడిని ముందే పసిగడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పైగా వివిధ ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికే ప్రతిపక్షం లేబర్ పార్టీ పైచేయిగా ఉన్నట్లు తెలుపుతున్నాయి.













