దేశంలో కరోనా విలయతాండవం… ఒక్కరోజులోనే

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులకు తగ్గడం లేదు. తాజాగా కేంద్రం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లోనే 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740. ఇప్పటి వరకు కరోనాతో 1,75,649 మంది చనిపోగా, 1,26,71,220 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 11,99,37,641 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.