కరోనాతో సింహం మృతి…

కరోనా వైరస్‍తో ఓ సింహం మృతి చెందింది. తమిళనాడులోని అరిగ్ నర్ అన్నా జూపార్క్ లో ఓ మగ సింహానికి కరోనా సోకి మృతి చెందింది. ఐదు రోజుల క్రితం సింహం అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు పరీక్షించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టింగ్ నిమిత్తం శాంపిల్స్ భోపాల్ లోని ల్యాబ్ కి పంపారు. రిపోర్టస్ లో పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. అయితే సింహం మృతిపై జూ అధికారులు స్పందించారు. దీర్ఘకాల వ్యాధులతో సింహం బాధపడుతుందని అందువల్లే మృతి చెంది ఉంటుందని తెలిపారు. ఇక ఈ సింహాంతో పాటు ఉన్న మరికొన్ని సింహాలకు పరీక్షలు నిర్వహించగా వాటికి కూడా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. కాగా సింహాలకు కరోనా ఎలా సోకింది అనేది తెలియరాలేదు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. గత నెలలో హైదరాబాద్ జూలో కూడా 8 సింహాలకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.