మెదడుపై కరోనా ప్రభావం!
కరోనా రోగుల్లో తలనొప్పి, గందరగోళం, మతిమరుపు వంటి సమస్యలు తలెత్తడానికి కారణం చేస్తుండటమేనని అమెరికా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మెదడులో కరోనా వైరస్ సంఖ్యాపరంగా పెరుగుతూ, అక్కడున్న ఆక్సిజన్ కణాలను చుట్టుముడుతున్నాయని యేల్ యూనివర్సిటీకి చెందిన ఇమ్యునాలజిస్ట్ అకికో ఇవాసాకి తెలిపారు. తద్వారా మెదడుపై కరోనా ప్రభావం చూపుతున్నదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ అధ్యయనం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉన్నదని తెలిపారు.
ఈ అధ్యయనంలో వెల్లడైన ఫలితాలను కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రూ జోసెఫ్మెన్ సమర్థించారు. మెదడుకు జరిగే రక్త ప్రసరణను అడ్డుకునే సామర్థ్యం కరోనా వైరస్‌కు ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారని జోసెఫ్సన్ తెలిపారు. జికా వైరస్ కూడా రోగులపై ఇలాంటి ప్రభావాన్ని చూపినట్టు చెప్పారు.






