కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… 18 ఏళ్లు పైబడిన అందరికీ

దేశంలోకి ఒమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్ ప్రవేశించినట్లు వస్తోన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేలా టీకా పంపిణీని మరింత విస్తరించింది. ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్ల పైబడిన అందరికీ ప్రికాషన్ డోసులు పంపిణీ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ప్రైవేటు కేంద్రాల్లో మాత్రమే ఈ డోసుల పంపిణీ జరగనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 10 (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన 18 ఏళ్ల పైబడిన అందరూ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులు. అని ప్రైవేటు టీకా కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.