ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఆయన సతీమణి హేమలీల కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగు పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు. ఎవరికైనా అత్యవసరమైతే ఫోన్లో తనను సంప్రదించాలని సూచించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.






