కరోనా అంతానికి ఒక్క వ్యాక్సిన్ చాలు
కోవిడ్ వైరస్ ఎక్కువగా రూపాంతరం చెందడం లేదని, కరోనా బయట పడినప్పటి నుంచి అది రూపాన్ని మార్చుకున్న కేసులు ఎక్కువేమీ లేవని, అందువల్ల ఒకే వ్యాక్సిన్ కోవిడ్ వైరస్‌కు చెక్ పెట్టగలదని అమెరికాకు చెందిన సైంటిస్టులు చెప్పారు. దాదాపు 27 వేల మంది కరోనా రోగులపై పరిశోధన అనంతరం ఈ విషయాన్ని చెబుతున్నట్లు తెలిపారు. 84 దేశాల్లోని 18,514 ఇండిపెండెంట్ జీనోమ్ సీక్వెన్స్‌లను పరిశీలించినట్లు చెప్పారు. కరోనాలోని వివిధ జీనూ టైప్ స్ట్రెయిన్ లను పరిశీలించి ఈ వివరాలను వెల్లడించినట్లు చెప్పారు. ప్రస్తుతమున్న అన్ని రకాల కరోనా వైరస్ స్ట్రెయిన్లకు ఒకే వ్యాక్సిన్ మార్గం చూపగలదని అన్నారు. హెచ్ఐవీ, డెంగ్యూ, ఇన్ఫూయంజా వంటి వైరస్లు భారీస్థాయిలో రూపాంతరం చెందుతున్నందున వ్యాక్సిన్ ప్రయత్నానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని, కోవిడ్ విషయంలో ఆ స్థాయి మార్పు ఉండటం లేదని వెల్లడించారు.






