ఈ విషయంలో ఎవర్నీ ఒత్తిడి చేయవద్దు :సుప్రీంకోర్టు

దేశంలో కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌లను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ టీకా వేసుకోవాలని ప్రజల్ని ఒత్తిడి చేయవద్దు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ విధానం అసంబద్ధంగా ఉందని అనలేమని సుప్రీం తెలిపింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రరిణామాల గురించి కేంద్రం డేటాను రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలను కోర్టు తప్పుబట్టింది. వ్యాక్సిన్ వేసుకోని వారిని పబ్లిక్ ప్రదేశాలకు రానివ్వకపోవడం సరిగా లేదని కోర్టు తెలిపింది. అలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు వెంటనే వాటిని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు కోరింది. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి, ప్రజా సంక్షేమం కోసం కొన్ని షరతులను అమలు చేయాలని కోర్టు తన తీర్పులో చెప్పింది.