భారత్ బయోటెక్ కీలక ప్రకటన.. టీకా తీసుకున్నాక వద్దు

కొవాగ్జిన్ తీసుకున్న తర్వాత పారా సిటమాల్ కాని పెయిన్ కిల్లర్స్ కానీ వాడాల్సిన అవసరం లేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. టీ తీసుకున్నాక మాత్రలు వాడాలని తాము సూచించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న టీనేజర్లకు ఆయా టీకా కేంద్రాల్లో పారిసిటమాల్ 500 ఎంంజీ టాబ్లెట్లు ఇస్తున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ ఈ ప్రకటన చేసింది. 30 వేల మందిపై టీకా ట్రయల్స్ నిర్వహించామని, 10 నుంచి 20 శాతం మందికే సైడ్ ఎఫెక్టులు వచ్చాయని, అవికూడా చిన్న వేనని పేర్కొంది. టీకా తీసుకున్న తర్వాత వైద్యుడిని సంప్రదించాకే పారాసిటమాల్ తీసుకోవాలని సూచించింది.