మరోసారి పదివేల దిగువకు కేసులు

దేశంలో కరోనా కేసులు మరోసారి పదివేల దిగువకు పడిపోయాయి. 7,65,944 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,309 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే రోజూవారీ కేసుల్లో భారీ తగ్గుదలే కనిపించింది. అలాగే ఈ నెలలో మరొసారి 100లోపు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 87 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు 1,08,80,603 మంది ఈ మహమ్మారి బారిన పడగా 1,55,447 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం 1,35,926 క్రియాశీల కేసులుండగా ఆ రేటు 1.25 శాతానికి చేరింది. రికవరీ రేటు 97.32 శాతానికి పెరిగింది. కోలుకున్నవారు 1.05 కోట్లుకు పైబడ్డారు.