24 గంటల్లో 1.31 లక్షల కేసులు.. 780 మంది మృతి

దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 780 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా రెండోదశలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దాదారు ఆరు రోజుల క్రితం 714 మరణాలు సంభవించాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,60,542కు చేరింది. కొత్తగా 61,899 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,19,13,292 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన మరణాలతో మృతుల సంఖ్య 1,67,642కు పెరిగింది. దేశంలో 9,79,608 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,43,34,262 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. అత్యధిక కొవిడ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది.