దేశంలో కొత్తగా 12,689 కేసులు

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,689 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. వైరస్ వల్ల 24 గంటల్లోనే 137 మంది మరణించారు. వైరస్ సోకిన వారిలో 13,320 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య కోటి ఏడు లక్షలకు చేరుకున్నది. దీంట్లో యాక్టివ్ కేసులు లక్షా 76 వేలు ఉన్నాయి. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కోటి నాలుగు లక్షలుగా ఉన్నది. ఇండియాలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 1,53,724 కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతున్నది. కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 20,29,480గా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.