దేశంలో రికార్డుస్థాయిలో కేసులు…

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ రికార్డు స్థాయిలో వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,19,588 టెస్టులు చేయగా 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. కొత్తగా 2,17,113 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,40,85,110 చేరి, 83.49 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 2,767 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,92,311కు చేరింది. ప్రసుత్తం దేశ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక టీకాల విషయానికొస్తే నిన్న 25,36,612 మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. దీంతో మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 14,09,16,417కి చేరింది.