రెండు డోసుల మధ్య 4-8 వారాల వ్యవధిని ఉంచండి : రాష్ట్రాలకు కేంద్రం లేఖ

కరోనా టీకా కోవిషీల్డ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాసింది. కోవిషీల్డ్ తో మెరుగైన ఫలితాలు పొందేందుకు రెండు డోసుల మధ్య 4-8 వారాల వ్యవధిని పెంచాలని ప్రతిపాదించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్రం లేఖలు రాసింది. అయితే ఈ ప్రతిపాదన కేవలం కోవిషీల్డ్ టీకాకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి గురించి ఎన్‌టీఏజీఐ, ఎన్‌ఈజీవీఏసీ మరోసారి సమీక్ష జరిపింది. పలు శాస్త్రీయ ఆధారాలను ఆధారభూతంగా చేసుకొనే దీనిపై చర్చ జరిగిందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులుగా ఉంది. మరింత మెరుగైన ఫలితాల కోసం 4-8 వారాల ఉంచితే బాగుంటుందని కేంద్రం పేర్కొంది.