కేంద్రం కీలక నిర్ణయం.. సెకండ్, బూస్టర్ మధ్య!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోన్నట్లు తెలుస్తున్నది. కరోనా వ్యాక్సిన్ రెండో టీకా, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్‌ను తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగనున్నది. ప్రస్తుతం రెండో డోస్ తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతనే బూస్టర్ డోస్ వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గ్యాప్‌ను ఆరు నెలలకు తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు రెండు, మూడో డోస్ టీకాల మధ్య గ్యాప్‌ను చాలా వరకు తగ్గించాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం సైతం త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.