కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం పోటీపడుతున్న మాజీ అమెరికా అధ్యక్షులు

అమెరికాలో కరోనావైరస్ సెకండ్ వేవ్ మొదలు అయిందా అంటే అవును అని చెప్పాల్సిన పరిస్థితి కనబడుతున్నది. అమెరికాలో రోజువారీ కరోనావైరస్ మరణాల సంఖ్య 2,760 గా నమోదు అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలుపగా ఏప్రిల్ నెలలో దేశంలో కరోనావైరస్ మహమ్మారి తో మరణించిన వారి సంఖ్య కంటే ఈ సంఖ్య అధికం గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రులు కరోనావైరస్ రోగులతో నిండుతుందగా రాబోయే రోజులు స్పష్టంగా మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈపాటికే వివిధ ఫార్మా సంస్థలు వారి కరోనావైరస్ వ్యాక్సిన్ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా ప్రభుత్వం కరోనావైరస్ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపిన కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంతమంది ప్రజలు భయ పడుతుండడంతో ముగ్గురు మాజీ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యు. బుష్ మరియు బిల్ క్లింటన్ ఒకసారి అమెరికా ప్రభుత్వం ఒక కరోనావైరస్ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపిన తరువాత ఆ కరోనావైరస్ వ్యాక్సిన్ ను బహిరంగంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కరోనావైరస్ వ్యాక్సిన్ భద్రతపై ప్రజల విశ్వాసాన్ని నిర్ధారించడంలో ఈ చర్య సహాయపడుతుంది అని వారు అభిప్రాయపడ్డారు. “నేను కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు టీవీలో మరియు వివిధ మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. అందువల్ల నేను ఈ శాస్త్రాన్ని విశ్వసిస్తున్నానని ప్రజలకు నమ్మకం కలగవచ్చు” అని మాజీ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా తెలిపారు. ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ మైనారిటీ వర్గాలలోని కొందరు సభ్యులు కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం లో ఎందుకు అనుమానం కలిగి ఉంటారో వైద్య దుర్వినియోగ చరిత్రను మరియు నల్లజాతీయులలో ఏర్పడిన అపనమ్మకాన్ని తెలియజేశారు.
ప్రెసిడెంట్ బుష్ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్ గురువారం సిఎన్ఎన్ తో మాట్లాడుతూ మాజీ అధ్యక్షులు కరోనావైరస్ వ్యాక్సిన్ ను ప్రోత్సహించడంలో ఎలా సహాయపడగలరో తెలుసుకుంటానికి ప్రజారోగ్య అధికారులను సంప్రదించినట్లు తెలిపారు. మాజీ అధ్యక్షులు క్లింటన్ యొక్క ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా సిఎన్ఎన్తో మాట్లాడుతూ మాజీ అధ్యక్షులు కూడా అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపిన కరోనావైరస్ వ్యాక్సిన్ ను తనకు అందుబాటులోకి వచ్చిన వెంటనే బహిరంగంగా ఆ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని చెప్పారు.