దేశంలో కరోనా కల్లోలం…

దేశంలో కరోనా సృష్టిస్తోన్న కల్లోలం ఇప్పట్లో ఆగేలా లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, 2,263 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1,93,279 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695 పెరగ్గా, ఇప్పటి వరకు 1,36,48,159 మంది కోలుకున్నారు. మొత్తం మహమ్మారి బారినపడి 1,86,920 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 24,28,616 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా నిన్న 31,47,782 మందికి కేంద్రం టీకా డోసులను పంపిణీ చేసింది. దీంతో ఆ సంఖ్య 13.54 కోట్లకు చేరుకుంది. మొత్తంగా 59.08 శాతం టీకా పంపిణీ 8 రాష్ట్రాల్లోనే నమోదైందని వెల్లడించింది.