మోదీ నిర్ణయం కరెక్ట్… నేను చెప్పినట్టే చేశారు!

ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏకీభవించారు. తాను చెప్పినట్టే మోదీ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. బూస్టర్ ఇవ్వడం ప్రారంభించాలన్న తన సలహాలను కేంద్రం అమలు చేసేందుకు సిద్ధం అవుతోందన్నారు. ఒమిక్రాన్‌పై పోరు విషయంలో బూస్టర్ ఇవ్వడానికి ముందుకు రావడంతో సంతోషకరమని తెలిపారు. ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలని, వ్కాక్సిన్‌తోనే రక్షణ ఉంటుందని చెప్పుకొచ్చారు. 60 ఏళ్ల వయస్సు దాటి ఇతరాత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోసు అందించనున్నామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.