అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి
ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి కారులో ప్రయాణిస్తూ దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరానాజ్ (22) నగరంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్లారు. నగరంలో కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీకవడంతో డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని మృతికి సంబంధించి వైద్య నివేదిక రావాల్సి ఉంది.













