టీటీఏ మహాసభ లో సినీ సందడి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాసభలకు టాలీవుడ్ నుంచి కళాకారులు తరలి వస్తున్నారు. జూలై 17 నుండి 19 వరకు నార్త్ కరొలినాలోని ఛార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ మహాసభలకు హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకులు సందీప్ వంగ, రామ్ గోపాల్ వర్మ, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, విశ్వ ప్రసాద్, నవీన్ ఎర్నేని తదితరులు వస్తున్నారు. అలాగే కామెడీ యాక్టర్, హీరో సునీల్, సుబ్బరాజు, సందీప్ కిషన్ కూడా వస్తున్నారు. ఇంకా పలువురు కళాకారులు కూడా వస్తున్నారని నిర్వాహకులు చెప్పారు.








