మే 2న TAGDV ఉగాది సంబరాలు
TAGDV: గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) తన 53 ఏళ్ల వేడుకలలో భాగంగా మే 2, 2026 (శనివారం) రోజు అత్యంత వైభవంగా ‘ఉగాది ఉత్సవాలు’ నిర్వహించబోతోంది. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఉత్సాహవంతులైన వాలంటీర్లు ముందుకు రావాలని సంస్థ కోరుతోంది. పెన్సిల్వేనియాలోని డౌనింగ్ టౌన్ హైస్కూల్ ఈస్ట్‌లో ఈ సాంస్కృతిక వేడుకలు జరగనున్నాయి.
లభించే ప్రయోజనాలు ..
ఈ ఉత్సవాల్లో సేవలు అందించేందుకు ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాలంటీర్లకు ఈ క్రింది ప్రయోజనాలు లభిస్తాయి..
- అధికారిక వాలంటీర్ అవర్స్ (Volunteer Hours).
- సేవలను గుర్తిస్తూ వాలంటీర్ సర్టిఫికేట్ అందజేస్తారు..
- కమ్యూనిటీతో కలిసి పనిచేసే అవకాశం , వ్యక్తిగత ఎదుగుదలకు వేదిక.
రిజిస్ట్రేషన్ వివరాలు..
వాలంటీర్లుగా చేరాలనుకునే వారు TAGDV అధికారిక వెబ్సైట్ tagdv.com/volunteer-registration ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం లావా కుమార్ ఇనంపూడి (267-371-2909) లేదా శివ అనంతుని (215-290-7482)లను సంప్రదించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ, సమాజ సేవలో భాగస్వాములు కావాలని TAGDV ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి








