మే 2న అట్టహాసంగా ‘గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం’ ఉగాది ఉత్సవాలు
TAGDV: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థలలో ఒకటైన గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) తన 53వ వార్షికోత్సవ వేడుకలను , ఉగాది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకాకర్షణ “మనీషా ఈరబత్తిని మ్యూజికల్ నైట్” ప్రేక్షకులను అలరించనుంది.
మనీషా ఈరబత్తిని గాత్రంతో..
వచ్చే నెల మే 2, శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఈ సంబరాలు ప్రారంభం కానున్నాయి. పెన్సిల్వేనియాలోని డౌనింగ్టౌన్ హైస్కూల్ ఈస్ట్ (Downingtown High School East) వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రముఖ సినీ గాయని మనీషా ఈరబత్తిని తన అద్భుతమైన గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించనున్నారు.
అతిథులు , నిర్వాహకులు..
ఈ కార్యక్రమాన్ని TAGDV అధ్యక్షుడు తులసీ రామ్ మోహన్ రావు తాళ్లూరి నేతృత్వంలో కార్యవర్గ సభ్యులు హరీష్ అన్నబత్తిన (వైస్ ప్రెసిడెంట్), సురేష్ బొండుగుల (సెక్రటరీ), మధు బూదాటి (ట్రెజరర్), శ్రీకాంత్ చుండూరి, శివ అనంతుని , ఇతర సభ్యులు సమన్వయం చేస్తున్నారు. ఈ వేడుకకు MATA (Mana American Telugu Association) సహ-నిర్వహకులుగా వ్యవహరిస్తున్నారు.
RSVP తప్పనిసరి..
ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు ముందుగానే RSVPచేసుకోవడం తప్పనిసరి అని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారు tagdv.com/rsvp లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకల్లో డెలావేర్ వ్యాలీలోని తెలుగు వారందరూ పాల్గొని జయప్రదం చేయాలని కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి








