అమెరికా స్వాతంత్య్ర ప్రకటన

అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు సంబంధించిన అరుదైన రాత ప్రతిని హార్వర్డ్ పరిశోధకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలో తోలు కాగితంపై రాసిన ఈ ప్రతిని బ్రిటన్‌లోని ఓ దస్త్రాల కార్యాలయంలో వారు గుర్తించారు. బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా యుద్దం సాగించిన అమెరికాలోని 13 రాజ్యాలు 1776లో జులై 4నన స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. ఈ మేరకు ఫిలడెల్ఫియాలో చరిత్రాత్మక స్వాతంత్య్ర ప్రకటనను ఆమోదించాయి. ఈ ప్రకటనకు సంబంధించి రెండే తోలు కాగితపు రాత పత్రులు ఉండగా, మొదటిది అమెరికాలో వాషింగ్టన్‌లోని నేషనల్ ఆర్కైవ్స్‌లో ఉంది. ఇప్పుడు లభ్యమైంది రెండో ప్రతి. పరిశోధకులు ఇది 1780ల నాటిదేనని తేల్చారు. అమెరికా వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జేమ్స్ విల్సన్ దీన్ని రూపొందించాలని ఆదేశించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.











































































