ఏప్రిల్ 19న మిస్సౌరీలో ‘నాట్స్’ ఉచిత వైద్య శిబిరం!
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మిస్సౌరీ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రవాస తెలుగువారి కోసం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని (Free Medical Health Camp) ఏర్పాటు చేస్తున్నారు. మహాత్మా గాంధీ సెంటర్ (MGC) సహకారంతో ఈ శిబిరం ఏప్రిల్ 19, ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
బాల్విన్లోని మహాత్మా గాంధీ సెంటర్ వేదికగా జరగనున్న ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, MD నేతృత్వంలో నిపుణులైన డాక్టర్ల బృందం ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు.
అందించే వైద్య సేవలు..
ఈ హెల్త్ క్యాంప్‌లో జనరల్ ఫిజికల్ ఎగ్జామ్, బీపీ (Blood Pressure) చెకప్, బి.ఎం.ఐ (BMI) లెక్కించడం, కొలెస్ట్రాల్ టెస్ట్, బ్లడ్ గ్లూకోజ్, హెచ్.బి.ఎ.1.సి (HbA1c) టెస్ట్, ఇ.కె.జి (EKG), , పోషకాహార సలహాలు (Nutritional Advice) వంటి పరీక్షలు ఉచితంగా చేయనున్నాను.
ఇవి కూడా చదవండి
వివరాలు..
- తేదీ: ఏప్రిల్ 19, ఆదివారం (ఏప్రిల్ 19, 2026)
- సమయం: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు (CST)
- వేదిక: మహాత్మా గాంధీ సెంటర్, 727 Weidman Rd, Ballwin, MO 63011.
ఈ శిబిరంలో డాక్టర్ సుధీర్ అట్లూరితో పాటు డాక్టర్ దర్సి లక్ష్మణ్ బాపూజీ, డాక్టర్ నిశాంత్ పొద్దార్, డాక్టర్ వెంకట్ బోడవూల, డాక్టర్ మధు దుక్కిపాటి, డాక్టర్ పాండురంగారావు కోయ వంటి నిపుణులు పాల్గొంటున్నారు.
నిర్వాహకులు..
నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి నేతృత్వంలో మిస్సౌరీ చాప్టర్ బృందం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తెలుగు వారందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
సంప్రదించాల్సిన వారు:
- రమేష్ బెల్లం: (201) 270-8930
- శ్రీనివాస్ మంచికాలపూడి: (408) 569-7162
- సందీప్ కొల్లిపర: (908) 279-3455
- నాగ శ్రీనివాస్ సిస్ట్లా: (314) 809-5765
- అన్వేష్ చాపరాల: (224) 401-9984″








