నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘కిడ్స్ ఫన్ 2026’
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పిట్స్బర్గ్ విభాగం చిన్నారుల కోసం ప్రత్యేకంగా ‘కిడ్స్ ఫన్ 2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారికి వినోదాన్ని పంచే లక్ష్యంతో ఈ ఈవెంట్‌ను రూపొందించారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు.
ఉచితంగా కర్సివ్ రైటింగ్..
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం పలు ఆసక్తికరమైన అంశాలను చేర్చారు. ఉచితంగా నేర్చుకునే కర్సివ్ రైటింగ్ (Cursive Writing) తో పాటు ఆర్ట్ డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేందుకు మ్యాథ్ క్విజ్ భక్తి మార్గంలో శ్లోకాలు భగవద్గీత పఠనం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చిన్నారులకు ఇష్టమైన లెగో (LEGO) ఆటలను కూడా ఇందులో చేర్చారు. పిల్లలు ఈ కార్యకలాపాలను తమకు వీలైన సమయంలో పూర్తి చేసి ఈవెంట్ హాల్లో సమర్పించవచ్చు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు natsworld.org/kidsclub2026 అనే వెబ్సైట్ ద్వారా లేదా ఫ్లయర్పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎన్ఏటీఎస్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందడి పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్‌కు సంబంధించిన సందేహాల కోసం natspittsburgh@natsworld.org ఈమెయిల్ ద్వారా లేదా ఎన్ఏటీఎస్ హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.








