నాట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న తటవర్తి కల్యాణ చక్రవర్తితో ఇష్టాగోష్ఠి కార్యక్రమం
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) అనుబంధ విభాగం ‘నాట్స్ లలిత కళా వేదిక’ ఆధ్వర్యంలో “తటవర్తి తెలుగు పద్యయజ్ఞం” అనే విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా శతాధిక అవధానార్చనార్చార్య, అవధాన కల్యాణమూర్తి, అవధానార్చన భారతి బిరుదు ప్రాప్తులు తటవర్తి కల్యాణ చక్రవర్తితో ప్రత్యేక ‘ఇష్టాగోష్ఠి’ కార్యక్రమం జరగనుంది. ఏప్రిల్ 19, ఆదివారం ఉదయం 8 గంటలకు (EST) ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
NATS నాయకత్వ పర్యవేక్షణలో..
ఈ కార్యక్రమాన్ని NATS చైర్మన్ కిషోర్ కంచర్ల ,ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి నేతృత్వంలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను పూర్తి చేశారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను కి.భా.శ్రీ (ఛైర్), మురళీకృష్ణ మెడిచెర్ల, సాయి యర్రప్రగడ, గిరి కంభంమెట్టు, శ్రీనాథ్ జంధ్యాల పర్యవేక్షిస్తున్నారు.
ప్రతినిధులు , నిర్వాహకులు..
ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన పలువురు సభ్యులు ,కార్యకర్తలు భాగస్వాములు కానున్నారు. వారిలో రాజ్ అల్లాడ, హరినాథ్ బుంగటావ్యుల, శ్రీనివాసరావు భీమినేని, హేమంత్ కొల్లా, భాను ప్రకాష్ ధూళిపాళ్ల, శ్రీనివాస్ చిలుకూరి, రాజేష్ కండ్రు తదితరులు పాల్గొంటున్నారు.
తెలుగు పద్యం ప్రాముఖ్యతను, భాషా సౌందర్యాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ ఇష్టాగోష్ఠిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం నాట్స్ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.








