టీటీఏ మహాసభ లో మ్యూజిక్ స్టార్స్
టీటీఏ నిర్వహిస్తున్న మహాసభలకు పలువురు సంగీత కళాకారులు, గాయనీ గాయకులు, జానపద గాయనీ గాయకులు తరలి వస్తున్నారు. ప్రముఖ దర్శకులు ఎం.ఎం. కీరవాణి సంగీత విభావరి ఈ మహాసభల్లో హైలైట్‌గా నిలవనున్నది. అలాగే గాయనీగాయకులు రమ్య బెహరా, సాహితీ చాగంటి, సోనీ కుమార్, బి.వి.ఎన్.ఎస్. రోహిత్, లుక్సిక తదితరులు తమ పాటలతో అందరినీ అలరించనున్నారు.
ఈ మహాసభల్లో మరో ప్రత్యేక ఆకర్షణగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నిలవనున్నారు. తాను నటించిన ఎల్లమ్మ’ సినిమా పాటల ఆవిష్కరణ వేడుకలను ఇందులో చేయనున్నట్లు సమాచారం. దాంతోపాటు తన ఆటపాటలతో అందరినీ దేవిశ్రీ ప్రసాద్ మైమరపింపజేయనున్నారు.
తనదైన పాటలతో అందరినీ మెప్పించిన ప్రైవేట్ ఆల్బమ్ గాయకుడు రాము రాథోడ్ కూడా ఈ మహాసభల్లో అందరినీ మెప్పించనున్నారు. వీరితోపాటు వందేమాతరం శ్రీనివాస్ తదితర గాయనీ గాయకులు కూడా ఇందులో తమ పాటలను పాడనున్నారు.








