GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ షార్లెట్ చాప్టర్ కొత్త కార్యవర్గం ఖరారు!
GTA: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) తన షార్లెట్ చాప్టర్ (Charlotte Chapter) కొత్త కార్యవర్గ కమిటీ, అడ్వైజరీ బోర్డును ప్రకటించింది. సమాజ సేవలో ఉత్సాహంగా పాల్గొనే నాయకులు, వాలంటీర్లు, కమ్యూనిటీ ఛాంపియన్లతో కూడిన ఈ బృందాన్ని జీటీఏ అమెరికా జాతీయ అధ్యక్షుడు బాపు రెడ్డి కేతిరెడ్డి అధికారికంగా పరిచయం చేస్తూ అభినందనలు తెలిపారు.
నాయకత్వం:
షార్లెట్ చాప్టర్ అధ్యక్షుడిగా శ్రీకర్ నాగుల బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా ప్రదీప్ వెన్నమనేని, జనరల్ సెక్రటరీగా భరత్ కుంభం, జాయింట్ సెక్రటరీగా సాయి కిరణ్ నాయక్, కోశాధికారిగా రాజేందర్ చీటి, జాయింట్ ట్రెజరర్‌గా శ్రీనివాస్ మాడ్లపల్లి ఎంపికయ్యారు.
ఇవి కూడా చదవండి
GTA గ్లోబల్, జాతీయ బోర్డు ప్రతినిధులు:
- బాపు రెడ్డి కేతిరెడ్డి – ప్రెసిడెంట్
- మన్మోహన్ రెడ్డి పోతుల – బోర్డ్ ఆఫ్ ట్రస్టీ
- కృష్ణ కడారి – బోర్డ్ ఆఫ్ ట్రస్టీ
- ప్రవీణ్ కేసిరెడ్డి – ఛైర్మన్
- వివిధ కమిటీల బాధ్యులు:
మహిళా సాధికారత, సాంస్కృతిక కార్యక్రమాలు, యువత పెంపొందించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కమిటీలను ఏర్పాటు చేశారు.
కల్చరల్ ఛైర్: ప్రియాంక కోడటి - మీడియా ఛైర్: మౌనిక కొక్కిరాల
- మార్కెటింగ్ ఛైర్: రవీందర్ కొనకటి
- స్పోర్ట్స్ ఛైర్: శ్రీనాథ్ గదే
- విమెన్ ఎంపవర్మెంట్ ఛైర్: సుమా నున్న
- ఈవెంట్ ఛైర్: మహేష్ కోల
- జగన్ మారెల్లి – వెండార్ కమిటీ ఛైర్
- నిశాంత్ – యూత్ ఎంపవర్మెంట్ ఛైర్కో-ఛైర్మన్లు (Co-Chairs):
- నరేంద్ర నాయక్ – లాజిస్టిక్ కమిటీ ఛైర్
- నాగ శ్వేత – మార్కెటింగ్ కో-ఛైర్
- అనిల్ నగినేని – స్పోర్ట్స్ కో-ఛైర్
- చరణ్ మంచికట్ల – కల్చరల్ కో-ఛైర్
- లావ కుమార్ రాయగళ్ల – లాజిస్టిక్స్ కమిటీ కో-ఛైర్
- శరత్ కుంభం – వాలంటరీ కమిటీ కో-ఛైర్
- శిరీష తమ్మిశెట్టి – మీడియా కో-ఛైర్
- వీణ రాయకం – ఈవెంట్ కో-ఛైర్
- అశ్విన్ మల్లికార్జున – వెండార్ కమిటీ కో-ఛైర్
- సాయి కృష్ణ లెంకల – వెబ్ కమిటీ కో-ఛైర్
- జ్యోతి భుక్య – విమెన్ ఎంపవర్మెంట్ కో-ఛైర్
అడ్వైజరీ బోర్డు:
షార్లెట్ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా వంశీ కేసిరెడ్డి, నర్సింగ్ పద్మ, రాజ్ పందిరి వ్యవహరిస్తారు.
జన్మభూమి – కర్మభూమి స్ఫూర్తితో:
ఈ సందర్భంగా జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు బాపు రెడ్డి కేతిరెడ్డి మాట్లాడుతూ.. షార్లెట్ చాప్టర్ కొత్త కార్యవర్గం సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ అవుట్రీచ్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జన్మభూమి,కర్మభూమి పట్ల బాధ్యతతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి







