GATeS: లక్ష్యానికి లక్ష అడుగులు.. గేట్స్ ‘వన్ మిలియన్ స్టెప్స్’ ఛాలెంజ్‌లో భాగస్వాములు అవ్వండి!
ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి! గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) తమ కమ్యూనిటీ సభ్యుల కోసం ‘వన్ మిలియన్ స్టెప్స్‘ ఛాలెంజ్‌ను సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. మనందరి ఐక్యతకు, పట్టుదలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక.

ఇవి కూడా చదవండి
ఉమ్మడి ప్రయాణం – అద్భుత ఫలితాలు
‘మనం వేసే ప్రతి అడుగు మన కమ్యూనిటీ బలాన్ని చాటి చెబుతుంది. మీరు మీ వ్యక్తిగత ఆరోగ్యం కోసం నడిచినా లేదా ఇతరులను ఉత్తేజపరిచేందుకు నడిచినా, మనమందరం కలిసి చేసే ఈ ప్రయత్నం అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, మైలురాళ్లను అధిగమిస్తూ చురుకైన భవిష్యత్తు వైపు సాగుదాం. ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి ఈ https://tinyurl.com/gatesstepschallenge లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. మన ఉమ్మడి ఆశయాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నడకను మొదలుపెడదాం.. ఆరోగ్యంగా జీవిద్దాం’ అని పేర్కొంది.








