టీటీఏ మెగా కన్వెన్షన్ – సీఎంఈ కార్యక్రమం
అమెరికాలోని ఛార్ల్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్లో భాగంగా, వైద్య నిపుణుల కోసం ఒక ప్రతిష్టాత్మక ‘కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన’ (సీఎంఈ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైద్యులకు వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి, నిపుణులతో పరిచయాలను పెంచుకోవడానికి, ‘ఏఎంఏ పీఆరఏ కేటగిరీ 1’ క్రెడిట్లను పొందేందుకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రసంగించనున్న వైద్య నిపుణులు
కీనోట్ స్పీకర్గా ఏఐజీ చైర్మన్, ఫౌండర్ డా. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, గెస్ట్ స్పీకర్గా కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. గురవారెడ్డి ప్రసంగించనున్నారు. వీరితోపాటు డా.సంతోష్ రెడ్డి దేవరపల్లి, డా.దీపక్ గారిపల్లి, డా.నందిని సుంకిరెడ్డి, డా.లలిత సి. మేడపల్లి, డా.సురేష్ రెడ్డి, డా.రఘువీర్ కూర, డా.వేణుమాధవ్ రెడ్డి కోట్ల వంటి నిపుణులు కార్డియాలజీ, జెరియాట్రిక్స్, క్యాన్సర్ నిర్ధారణ, మెడికల్ ఎంట్రప్రెన్యూర్షిప్ వంటి అంశాలపై ప్రసంగించనున్నారు.








