టీటీఏ మహాసభలకు రాజకీయ నాయకుల రాక
నార్త్ కరోలినాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 17, 18, 19 తేదీలలో జరగబోయే ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన’ టీటీఏ మెగా కన్వెన్షన్‌కు రాజకీయ నాయకులు వస్తున్నారని పొలిటికల్ ఫోరం చైర్ వాణిగడ్డం తెలిపారు. వాణి గడ్డంతో పాటు వివిధ పార్టీలకు చెందిన మరో ఏడుగురు కో-చైర్స్ ఈ కమిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలలో ఎనఆరఐల భాగస్వామ్యం, పెట్టుబడులు మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఒక బలమైన వారధిని నిర్మించడాన్ని థీమ్‌గా పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామరస్యపూర్వకంగా చర్చలు జరపడం ద్వారా ఇక్కడ ఉన్న వారికి అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు.
హాజరవుతున్న ప్రముఖ నాయకులు
కాంగ్రెస్ నుంచి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క వస్తున్నారు.
బిజెపి నుంచి ఎంపీ రఘునందన్ రావు రానున్నారు.
బిఆరఎస్, ఇతర పార్టీల నుంచి పలువురు వస్తున్నారు. ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, పైడి రాకేశ్వర్ రెడ్డి మొదలైన దాదాపు 20 మందికి పైగాఇతర పార్టీ నాయకులు హాజరవుతున్నారు.
కార్యక్రమ షెడ్యూల్
* జూలై 19 (ఆదివారం) సీతారాముల కల్యాణం మరియు లంచ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు (దాదాపు మÖడున్నర గంటలు) ఈ ఫోరమ్ కార్యక్రమాలు జరుగుతాయి.
* ప్యానెల్ డిస్కషన్ ` ఒక మోడరేటర్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల లీడర్లతో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సమయం వృధా కాకుండా ఉండటానికి ప్రేక్షకులు తమ ప్రశ్నలను లిఖితపూర్వకంగా మోడరేటర్‌కు అందించాల్సి ఉంటుంది
* మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. ప్రతి పార్టీకి విడివిడిగా ‘బ్రేకఅవుట్ రూమ్స’ ఉంటాయి. అక్కడ ఆయా పార్టీల కార్యకర్తలు లేదా ఎనఆరఐలు తమ లీడర్లను నేరుగా కలిసి వన్-ఆన్-వన్ మాట్లాడుకోవచ్చు
* పొలిటికల్ ఫోరమ్ కోసం ఎటువంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ లేదా అదనపు ఫీజు లేదు. కన్వెన్షన్ పాస్/టికెట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందులో ఉచిత ప్రవేశం ఉంటుంది.








