రావణుడిగా యష్ విశ్వరూపం.. రామాయణంలో అసలైన హైలైట్!
నితేశ్ తివారీ(nitesh tiwari) దర్శకత్వంలో తెరకెక్కిన ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణం: పార్ట్1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమైనప్పటికీ కన్నడ స్టార్ యష్(Yash) మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. రావణుడి పాత్రలో యష్ కనిపించిన తీరు, అతడి గంభీరమైన ఆహార్యం, తెరపై చూపించిన ఆధిపత్యం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా యష్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్, శివతాండవ ఘట్టం సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రావణుడిని శక్తిమంతమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇక శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్(ranbir kapoor), సీతాదేవిగా సాయి పల్లవి(Sai pallavi) తమ యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే(Ravi dhube), హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny deol) కీలక పాత్రల్లో కనిపించారు. అరుణ్ గోవిల్(Arun govil), శోభన(Sobhana), కాజల్ అగర్వాల్(kajal aggarwal), రకుల్ ప్రీత్ సింగ్(Rakul preeth singh), లారా దత్తా(laura datta), వివేక్ ఒబెరాయ్(Vivek oberoi), కునాల్ కపూర్(Kunal kapoor) తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.
భారీ విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన నిర్మాణ విలువలు, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో రూపొందిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ విజువల్ ఎపిక్‌లో యష్ పోషించిన రావణుడి పాత్ర ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.







